కోల్‌కతాలో మహిళా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో విచారణ వేగంగా జరుగుతున్నది. నిందితుడు సంజయ్ రాయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టగానే, అతను క్రైంను అంగీకరించినట్లు తెలుస్తోంది. అతను ఏ మాత్రం పశ్చాతాపాన్ని చూపలేదట. కావాలంటే ఉరి తీసుకోండి అంటూ పేర్కొన్నాడట. నిందితుడి మొబైల్ ఫోన్‌లో మొత్తం పోర్న్ వీడియోలే ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా రాయ్‌ను అరెస్టు చేశారు.