దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన డాక్టర్ హత్యాచారం కేసుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని మమత సీబీఐని కోరారు. "మా కోల్‌కతా పోలీసులు 90 శాతం విచారణను పూర్తి చేశారు" అని ఆమె తెలిపారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కోరారు.