క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. ఖండించిన హరీశ్ రావు

55చూసినవారు
క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. ఖండించిన హరీశ్ రావు
సిద్దిపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన Xలో ట్వీట్ చేశారు. ‘పోలీసులు దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారినే కాపాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండాపోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారు? దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్