పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. తన ఫోన్ టాప్ చేయించారని సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 1న హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్ రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హరీష్ రావు కోరారు.