హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందుగా ఎన్నికల సంఘం ప్రకటించినట్టుగా ఎన్నికలు అక్టోబర్ 1న జరగాల్సి ఉన్నది. కమ్యూనిటీ నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈసీ ఎన్నికల తేదీని ఇదే నెల 5కు మార్చింది. బిష్ణోయ్ కమ్యూనిటీ పండుగ ఇదే సమయంలో ఉండటంతో ఓటింగ్ హక్కులను గౌరవిస్తూ ఎన్నికల తేదీని మార్చినట్టు ఈసీ ప్రకటించింది.