ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఆరోగ్య సంరక్షణ సంస్థ ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ హైదరాబాద్‌లో ప్రపంచ సామర్థ్య (గ్లోబల్ కేపబిలిటీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే 2024 మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. కార్యకలాపాల విస్తరణ దిశగా కొత్త క్యాంపస్ కోసం 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇటీవల లీజుకు తీసుకుంది. ఈ కంపెనీ ప్రతినిధులు సీఎం బృందంతో చర్చలు జరిపారు.