దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.16,821 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15,976 కోట్లతో పోలిస్తే నికర లాభం 5 శాతం మేర వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం సైతం రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.