ఇల్లాలి ప్రాణం తీసిన ఇన్‌స్టా పరిచయం

72చూసినవారు
ఇల్లాలి ప్రాణం తీసిన ఇన్‌స్టా పరిచయం
AP: తూర్పుగోదావరి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రాజానగరం మండలానికి చెందిన ఓ వివాహితకి ఇన్‌స్టాలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి, చాలా కాలం చాటింగ్ నడిచింది. ఆ సమయంలో సదరు వ్యక్తి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయగా.. ఆమె నాలుగు లక్షల నగదు, బంగారం ఇచ్చేసింది. ఆపై నగల విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్