ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారికంగా హామీల అమలు క్యాలెండర్ ప్రకటనకు సిద్దం అవుతోంది. అయితే రైతులకు ఇచ్చిన హమీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ కసరత్తు తర్వాత ప్రస్తుత సంవత్సరంలో ఈ పథకం అమలు సాధ్యపడదనే అంశం స్పష్టం అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం అమలు కానుందని సమాచారం.