HDFC బ్యాంక్ లక్షద్వీప్‌లోని కవరత్తీ ద్వీపంలో తొలి శాఖను ప్రారంభించింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు శాఖను తెరిచిన తొలి ప్రైవేటు బ్యాంకుగా నిలిచింది. మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షద్వీప్ పర్యాటక స్థలంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల టూరిస్ట్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఈ తరుణంలో HDFC బ్యాంక్ తమ శాఖను ప్రారంభించడం గమనార్హం.