కుక్క తలపై కర్రతో కొట్టి చంపేశాడు (వీడియో)

569చూసినవారు
యూపీలోని కాన్పూర్ సమీపంలో సోమవారం దారుణం జరిగింది. చకేరి సహదుల్లాపూర్‌ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ తాగుబోతు విచక్షణ కోల్పోయాడు. రోడ్డుపై పడుకున్న వీధి కుక్క తలపై పెద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆ కుక్క బాధతో విలవిల్లాడింది. కొద్ది సేపటికే ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్