అంత్యక్రియలకు డబ్బుల్లేక.. మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేశాడు

80చూసినవారు
అంత్యక్రియలకు డబ్బుల్లేక.. మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేశాడు
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. పదేళ్లుగా తనతో సహజీవనం చేసిన భాగస్వామి మృతదేహాన్ని ఓ వ్యక్తి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి (53) తనతో సహజీవనం చేస్తున్న మహిళ అనారోగ్యంతో చనిపోగా.. ఆ మృతదేహాన్ని 3 రోజులుగా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరా తీయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్