పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ

72చూసినవారు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ
TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. ఈ తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్