ముంబైలో భారీ వర్షం.. స్తంభించిపోయిన ట్రాఫిక్

57చూసినవారు
ముంబైలో భారీ వర్షం.. స్తంభించిపోయిన ట్రాఫిక్
ముంబైలో భారీ వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీగా వర్షం పడింది. నగరంలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు వీస్తూ వర్షం పడింది. ఇంకా ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా.. ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేయబడినట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్