తల్లి ముందే కన్నడ నటుడిపై దాడి

66చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తులు కొంతమంది కన్నడ నటుడిపై దాడి చేసిన ఘటన కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. కన్నడ నటుడు చేతన్ చంద్ర నిన్న మాతృ దినోత్సవం కావడంతో తన తల్లితో కలిసి రాత్రి వేళ దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో తల్లితో కలిసి వస్తుండగా దాడి జరిగింది. 20 మంది కలిసి చేతన్ చంద్రపై రక్తం వచ్చేలా దాడి చేసి వెళ్లిపోయారు. రక్తం కారుతున్నా చేతన్ చంద్ర అలాగే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి ఈ ఘటన గురించి తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్