కేరళలో భారీ వర్షాలు..11మంది మృతి (వీడియో)

39790చూసినవారు
కేరళలో కుండపోత వాన కురుస్తోంది. గత రెండు రోజులుగా కేరళలో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో తిరువనంతపురం, త్రిస్సూర్‌, ఎర్నాకులం, వయనాడ్‌ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 11 మరణాలు నమోదైనట్లు మంత్రి కె.రాజన్‌ తెలిపారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్