శ్రీలంకలో భారీ వర్షాలు..15 మంది మృతి

78చూసినవారు
శ్రీలంకలో భారీ వర్షాలు..15 మంది మృతి
శ్రీలంకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని కొలంబోతో సహా 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, కొండచరియలు నేలకొరిగాయి. పలు ఘటనల్లో 15 మంది మరణించారు. 4,000కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా..28 ఇళ్లు పూర్తిగా కూలిపోయినట్టు విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్