ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదుల్లోకి వరద చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటిమట్టం పెరగడంతో 100కు పైగా రహదారులు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది పొంగి పొర్లుతుండటంతో 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. పౌరీ, నైనిటాల్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.