అభిమానిని చంపిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలులో ఆయన సిగరెట్ తాగుతూ సేదదీరుతున్నారు. తన ప్రేయసి, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడని రేణుకాస్వామి అనే అభిమానిని అనుచరులతో దర్శన్ కిడ్నాప్ చేయించారు. అనంతరం చిత్రహింసలు పెట్టి అతడిని హత్య చేశారు. ఈ కేసులో దర్శన్ 2024 జూన్ 11న అరెస్ట్ అయ్యారు.