తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా హీరో గోపీచంద్ స్పందించారు. ‘బాధ్యత గల పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలి. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిరాధారమైన వ్యాఖ్యలను వినడం ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నారు.’ అని హీరో గోపీచంద్ అన్నారు.