తమిళ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్ కీలక ప్రకటన చేశారు. 2026లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న ఆయన.. వచ్చే నెల 25న టీవీకే పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభలో తమ పార్టీ గుర్తు, విధివిధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.