హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు కుట్రపూరితమైనవి: అదానీ గ్రూప్‌

78చూసినవారు
హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు కుట్రపూరితమైనవి: అదానీ గ్రూప్‌
సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌కు అదానీ సంస్థతో లావాదేవీలున్నట్లు హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఈ ఆరోపణలు కుట్రపూరితమైనవని ప్రకటించింది. హిండెన్‌బర్గ్ అన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి వ్యక్తిగత లాభాలు పొందే ప్రయత్నం చేస్తోందని అందులో పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని చెప్పింది. గతంలో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని సుప్రీంకోర్టు అసత్యమని నిర్ధారించిందని అదానీ గ్రూప్ గుర్తు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్