ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెర మీద మేం చేసే పాత్ర ‘గేమ్ ఛేంజర్’లా ఉంటుంది. కానీ నిజజీవితంలో భారత రాజకీయాల్లోనే నంబర్-1 గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు. ప్రజల కోసం తపన పడే పవన్ కల్యాణ్ కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానన్నారు. ఆయన పక్కన నిలబడడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.