మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాజాగా రాజమండ్రి చేరుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజమండ్రి చేరుకున్నారు.