తమిళనాడులోని ఒక పానీపూరీ విక్రేత ఒక్క ఏడాదిలోనే రూ.40 లక్షల కంటే ఎక్కువ విలువైన యూపీఐ పేమెంట్స్ స్వీకరించగా, అతనికి జీఎస్టీ డిపార్ట్మెంట్ పన్ను నోటీసు ఇచ్చింది. 3 ఆర్థిక సంవత్సరాల్లో రేజర్పే, ఫోన్పే రిసిప్టులను అధికారులు పరిశీలించి, ఈ నోటీసు జారీ చేశారు. అతను TNGST, CGST చట్టాలు-2017 కింద నమోదు చేసుకోలేదని సమాచారం. వ్యక్తిగతంగా హాజరై, పత్రాలు సమర్పించాలని ఆ విక్రేతకు సమన్లు వచ్చాయి.