ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రవీంద్ర కుమార్ అనే ఉద్యోగి అమ్మాయి వలలో పడి భారత్‌కు చెందిన సున్నితపు విషయాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తిని, అతని సహాయకుడిని యూపీ యాంటీ–టెర్రరిజం స్వ్కాడ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.