కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. అక్కడి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై ఐదుగురు యువకులు రెండు బైకులపై వెళ్తూ.. ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారును వెంబడిస్తూ కాలితో తన్నారు. ఆ కారు డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ హల్‌చల్ చేశారు. ఆ వాహనాల ముందు బైకులతో ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ ఘటనను మరో కారులోని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది.