పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భటిండా-తల్వాండి సబో రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా 25 మంది రైతులతో వెళ్తున్న మినీ బస్సు శనివారం ఉదయం రోడ్డు డివైడర్‌ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.