ప్రముఖ నటి జాన్వీకపూర్ ఇవాళ తిరుమలలో సందడి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన సన్నిహితులతో కలిసి ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆమెకు వైకుంఠం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.