ఒక మేక ఎలక్ట్రిక్ వైర్లపైకి ఎక్కి.. అక్కడ ఉన్న గడ్డి మేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేక ఆహారం కోసం ఏకంగా కరెంట్ తీగలపైకి ఎక్కడంతో నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జరిగిందని నెటిజన్ వెల్లడించారు. అయితే, పూర్తివివరాలు మాత్రం లభ్యం కాలేదు.