భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం (వీడియో)

53చూసినవారు
తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్