సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘గ్లోబల్ ఏఐ’ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రేవంత్ మాట్లాడుతూ.. 'కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయి. వీటితో ఉద్యోగాలు పోతాయనే బెంగ పట్టుకుంది. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు' అన్నారు.