అమెరికాలో హైదరాబాద్‌ యువతి అదృశ్యం

79చూసినవారు
అమెరికాలో హైదరాబాద్‌ యువతి అదృశ్యం
అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల అనే యువతి అదృశ్యమైంది. మే 28 నుంచి కనిపించకుండా పోయింది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.

సంబంధిత పోస్ట్