బాగ్ అంబర్ పేట్ డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద బుధవారం తెల్లవారుజామున విద్యుత్ స్థంభాన్ని రేడిమిక్స్ వాహనం ఢీకొట్టింది. దీంతో స్థంభం సగం విరిగి నేలకు రాలిపోయింది. విద్యుత్ స్థంభం విరిగినందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమస్యను స్థానికులు స్థానిక నేత శ్రీకాంత్ కు ఫోన్ చేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వెంటనే పనులను త్వరగా పునరుద్ధరించాలని కోరారు.