హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాతబస్తీ బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో హుస్మాబాద్ ఖాద్రియా మజీద్ వద్ద భార్య గొంతు కోసి మృతదేహాన్ని తవులబెట్టాడు ఓ భర్త. బండ్లగూడకు చెందిన పైజ్ ఖురేషీ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. పిసల్ బండకి చెందిన ఖమర్ వేగంతో 6 సంవత్సర క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సైకోల మారిన భర్త హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.