లైన్‌మెన్‌పై నలుగురు వ్యక్తులు దాడి

84చూసినవారు
లైన్‌మెన్‌పై నలుగురు వ్యక్తులు దాడి
కరెంట్‌ బిల్లు కట్టమన్నందుకు విద్యుత్‌ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని కుల్సంపుర పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మొబైల్‌ షాప్‌ యజమాని మూడు నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం లేదు. దీంతో విద్యుత్‌ నిలిపివేసేందుకు వెళ్లిన లైన్‌మెన్‌ శ్రీనివాస్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు మంగళ్‌హాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్