ఉప్పుగూడలో అమ్మవారికి మహిషాసుర మర్దినిగా అలంకరణ

85చూసినవారు
ఉప్పుగూడలో అమ్మవారికి మహిషాసుర మర్దినిగా అలంకరణ
ఉప్పుగూడ పరిధిలోని రక్షా పురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ త్రిశక్తి ఆలయంలో శుక్రవారం ఉదయం 4. 00 గంటలకు, అమ్మవార్లను పంచామృతంతో అభిషేకం చేశారు. తదుపరి అమ్మవారిని నీలం రంగు చీరతో శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించారు. శ్రీ త్రిశక్తి అమ్మవార్లకు పూలమాలలు, నిమ్మకాయల దండలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం 9. 00 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు నేతి సేతు మాధవ శర్మ చండీ హోమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్