లాలాగూడ సీఐ సస్పెన్షన్

1561చూసినవారు
లాలాగూడ సీఐ సస్పెన్షన్
పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ సి ఐ పద్మను మంగళవారం సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చినందుకు విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్