మాస్టర్ మైండ్ స్కూల్ ను సీజ్ చేయాలని డిఈవో కు వినతి

57చూసినవారు
మాస్టర్ మైండ్ స్కూల్ ను సీజ్ చేయాలని డిఈవో కు వినతి
ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న పాతబస్తీ ఫలక్ నుమా లోని మాస్టర్ మైండ్ స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సబావాత్ కళ్యాణ్ హైదరాబాద్ డిఈవోను కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారుల కళ్లు గప్పి ఫైర్, ఆటస్థలం, జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల నుంచి ఎన్వోసి లేకున్నా, విద్యాశాఖ అనుమతి లేకుండానే మాస్టర్ మైండ్ స్కూల్ నడుస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్