ప్రియుడి మోసం.. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

68చూసినవారు
ప్రియుడి మోసం.. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి తాజాగా ఆత్మహత్య చేసుకుంది. పంకజ్, హర్షిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పంకజ్‌కు మరో యువతితో పెళ్లి నిశ్చయమైంది. తనను కాకుండా మరో యువతితో ప్రియుడు పంకజ్ పెళ్లికి సిద్ధమవడాన్ని హర్షిత తట్టుకోలేకపోయింది. తన చావుకు కారణం పంకజ్ అని లెటర్ రాసి, ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్