మాజీమంత్రి మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురి వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శంషాబాద్ లోని ఓ కన్వెన్షన్ లో ఆదివారం ఈ వేడుక జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా ఈ వేడుకలో మల్లారెడ్డి, సీఎం రేవంత్ కరణాచాలం చేసుకుని పలకరించుకోవడం హైలెట్ గా నిలిచింది.