హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.