లాంగర్ హౌస్ లో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వర్షపు నీరు

63చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లాంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ నుంచి రింగ్ రోడ్డు 100 వ నెంబరు పిల్లర్ వైపునకు వెళ్లే ప్రధాన ప్రధాన మార్గంలో రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో సుమారు గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్థానిక హనుమాన్ ఆలయంలో డ్రైనేజీ ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :