అధికారులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

57చూసినవారు
అభివృద్ధి పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని నానల్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ నాజిరుద్దీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం డివిజన్ పరిధిలోని సాలార్జంగ్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్