అయ్యప్ప మాలధారంలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జెఎసి నాయకులు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి మాట్లాడారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టు ను తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని అన్నారు.