సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం తిలకించడానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద ఏడు పెద్ద క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు తక్కువ సంఖ్యలోనే నిమజ్జనాలు జరిగిన.. అధిక సంఖ్యలో రాత్రి 7 గంటల నుండి రావచ్చని అంచనా వేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.