రాజు అనే గంజాయి స్మగ్లర్ ను సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్, చదార్ ఘాట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజు గంజాయిని చంద్రాపూర్ లోని పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్థర్ పై ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి రామగుండం అక్కడి నుండి నగరానికి తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.