పోలీసులమని బెదిరించి.. రూ. 10. 68 లక్షలు స్వాహా

74చూసినవారు
నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి (78)కి లక్నో పోలీసులమంటూ గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. మీ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగాయని అరెస్టు చేస్తామని బెదిరించాడు. డబ్బులు ఇస్తే కేసు నుంచి బయట పడేస్తామని తెలుపగా. భయపడ్డ బాధితుడు తన వద్ద ఉన్న రూ. 10. 68 లక్షలు పంపించేశారు. తర్వాత మోసమని తెలుసుకున్నారు. దీంతో ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కు ఫిర్యాదు చేసాడు.

సంబంధిత పోస్ట్