
మేడ్చల్: కన్న తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు
సాయినగర్ కాలనీలో నివాసముండే శంకర్ ను అతని కొడుకు జగదీష్ దాడిచేసి హత్య చేశాడు. ఈఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి రెండు గంటలప్రాంతంలో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా కోపంతో గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.