కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి పెళ్లికి ముందే గర్భవతిగా మారింది. అయితే ప్రియుడి సలహా మేరకు యూట్యూబ్ వీడియో చూసి తనకు తానే స్వయంగా బాత్రూంలో డెలివరీ చేసుకుంది. ప్రసవం అనంతరం ఆ బిడ్డ గొంతు నులిమి చంపి, మృత దేహాన్ని చెత్తకుప్పలో పడేసింది. స్థానికుల సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు సిమ్రాన్, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.